ముగించు

అగ్ని సేవలు

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక సేవల సమాచారం

శాఖ పేరు                                                         : రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ.

శాఖాధిపతి                                                       : శ్రీ మామిడి భగవాన్ రెడ్డి, బి.కామ్., బి.ఎడ్.,

హోదా                                                             : జిల్లా అగ్నిమాపక అధికారి.

కార్యాలయ చిరునామా                                    : అగ్నిమాపక మండల కార్యాలయము, వరంగల్, అగ్నిమాపక కేంద్రము        యొక్క 2 వ అంతస్థు, మట్వాడ పోలీసు స్టేషన్ ఎదురుగా,  మట్వాడ, వరంగల్, పిన్ – 506 002.

సంప్రదించవలసిన ఫోన్ నెం.                        : మొబైల్ నెం. : 8712699149, కార్యాలయపు ఫోన్. నెం. : 0870 – 2440083

ఇ-మెయిల్                                                        : dfo_wrl@yahoo.com 

అగ్నిమాపక శాఖ గురించి పరిచయము :

అగ్నిమాపక శాఖ, వరంగల్ జిల్లాలో 03 అగ్నిమాపక కేంద్రములు మరియు 01 ఫైర్ అవుట్ పోస్ట్ ల ద్వారా అగ్నిమాపక సేవలు అందచేయుచున్నవి. అగ్నిమాపక శాఖ అగ్ని ప్రమాదములను నివారించి, ప్రజలను వారి ఆస్తులను కాపాడదమే కాకుండా వరదలు, తుఫానులు మరియు రోడ్డు ప్రమాదములు మొదలగు అత్యవసర పరిస్థితులలో కూడా వీలయినంత వరకు  ప్రజలను వారి ఆస్తులను కాపాడుతున్నారు.

అగ్నిమాపక శాఖ కలుగచేయు వివిధములైన సౌకర్యముల గణాంకములు :

వరంగల్ జిల్లాలో ఏదైనా అత్యవసర పరిస్థితి జరిగినప్పుడు సంప్రదించవలసిన అగ్నిమాపక కేంద్రములు మరియు వాటి ఫోన్ నెంబర్లు దిగువ పట్టికలో చూపబడినాయి.

Sl.No అగ్నిమాపక కేంద్రం పేరు మొబైల్ నంబర్
1 అగ్నిమాపక కేంద్రం, వరంగల్ 8712699302
2 అగ్నిమాపక కేంద్రం, నర్సంపేట 8712699308
3 అగ్నిమాపక కేంద్రం, వర్ధన్నపేట 8712699310
4 ఫైర్ అవుట్‌పోస్ట్, గొర్రెకుంట (AMC, ఎనుమాములలో ఉంది) 8712699312

అగ్ని ప్రమాదములను ఆర్పివేయుటకు / ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనుటకు / ఉపయోగించు వాహనములు మరియు పంపులు ప్రతి అగ్నిమాపక కేంద్రములలో ఈ విధముగా ఉన్నాయి.

Sl.No వాహనాలు పంపులు
1 అధునాతన నీటి టెండర్ (కెపాసిటీ – 4500 లీటర్ల నీరు) 01
2 మిస్ట్ వెహికల్ (కెపాసిటీ – 300 లీటర్ల నీరు) 01
3 వాటర్ బౌసర్ (కెపాసిటీ – 9000 లీటర్ల నీరు) 01
4 పోర్టబుల్ పంప్ (కెపాసిటీ – 300 L.P.M.) 05
5 పొగమంచు బుల్లెట్ 03
6 మల్టీ పర్పస్ వాటర్ టెండర్ (నీరు, ఫోమ్ & డ్రై కెమికల్ పౌడర్) 02
7 నీటి టెండర్ (కెపాసిటీ – 4500 లీటర్ల నీరు) 02
8 అగ్నిమాపక & డీవాటరింగ్ PP 01

ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనుటకు / వరదలు మరియు తుఫానులు మొదలగు విపత్తులలో చిక్కుకున్న వారి యొక్క ఆస్థి మరియు ప్రాణములను రక్షించుటకు ఉపయోగించు పరికరములు ప్రతి అగ్నిమాపక కేంద్రములలో ఈ విధముగా ఉన్నాయి.

Sl.No పరికరాలు / సౌకర్యం పేరు
1 లైఫ్ జాకెట్లు
2 లైఫ్ బాయ్‌లు
3 కాటన్ తాడులు
4 నైలాన్ రోప్స్
5 మనీలా రోప్స్
6 పాలీ ప్రొపైలిన్ రోప్స్
7 B.A. సెట్లు
8 హ్యాండిల్‌తో పారలు
9 క్రో బార్‌లు
10 హైడ్రాలిక్ సెల్ఫ్ కంటెయిన్డ్ కాంబినేషన్ టూల్
11 డ్రాగన్ లైట్లు
12 టార్చ్ లైట్లు
13 సీలింగ్ హుక్స్
14 హ్యాండిల్‌తో స్పేడ్
15 పెట్రోల్ నడిచే చైన్ సా
16 పిక్ యాక్స్
17 హైడ్రాలిక్ వుడ్ కట్టర్ (చిన్నది)
18 హైడ్రాలిక్ వుడ్ కట్టర్(పెద్దది)
19 అస్కా లైట్ (విద్యుత్ వైఫల్యం సమయంలో లైటింగ్ ప్రయోజనం కోసం)

అగ్నిమాపక శాఖ అధికారుల వివరములు : అగ్ని మాపక శాఖ, వరంగల్ జిల్లాలో ఈ దిగువ వారు పని చేయు చున్నారు. 

Sl.No హోదా ప్రస్తుతం పని చేయు చున్న వారు రిమార్కులు
1 జిల్లా అగ్నిమాపక అధికారి 01
2 Asst. జిల్లా అగ్నిమాపక అధికారి 01
3 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 03
4 లీడింగ్ ఫైర్‌మెన్ 08
5 డ్రైవర్ ఆపరేటర్ 01
6 ఫైర్‌మెన్ 19
7 హోమ్ గార్డ్ ఫైర్‌మెన్ 14 హోమ్ గార్డ్స్ ఆర్గనైజేషన్ నుండి
8 TS RTC డ్రైవర్లు 08 TS RTC నుండి డిప్యూట్ చేయబడింది

అగ్నిమాపక శాఖ యొక్క కార్యక్రమాలు :

తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఒక అత్యవసర సేవల శాఖ. ప్రతి అగ్నిమాపక కేంద్రము లోని సిబ్బంది అగ్ని ప్రమాదములను నివారించుటకు, రోడ్డు ప్రమాదములు, వరదలు మరియు తుఫానులను ఎదుర్కొనుటకు 24 గంటలు ఆయా అగ్ని మాపక కేంద్రములలో అందుబాటులో ఉంటారు. ప్రతి శుక్రవారము, అగ్ని మాపక సిబ్బంది అగ్నిప్రమాదములు జరగకుండా, జరిగినా వాటిని  నివారించుటకై ప్రజలకు అవగాహన పెంపొందించు నిమిత్తము పాటశాలలు, కళాశాలలు, సినిమా ధియేటర్లు, పెట్రోల్ బంకులు, ఎల్.పి.జి. గోదాములు, ధాన్యపు మిల్లులు, ప్రత్తి మిల్లులు మొదలగు ప్రదేశములలో అవగాహనా కార్యక్రమములు నిర్వహించుచు, ప్రజలను చైతన్య పరచుచు అగ్నిప్రమాదములను తగ్గించుటకు దోహదపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని ప్రమాదముల నివారణ కొరకు అవగాహనా కార్యక్రమములు నిర్వహించుచున్నాము.

అగ్నిమాపక శాఖ ప్రజలకు అందజేయుచున్న సేవలు :

 అగ్నిమాపక శాఖ ద్వారా సెక్షన్ 13 లో నిర్వచించిన భవనములు మరియు విద్యా సంస్థలు, సినిమా ధియేటర్లు, మతసంబంధమైన భవనములు, శాశ్వత / తాత్కాలిక టపాసుల దుకాణములు మరియు బహుళ అంతస్థుల భవనములకు నిరభ్యంతర ధృవీకరణ పత్రములు జారీ చేయును మరియు రెన్యువల్ చేయును. పెట్రోల్ బంకులు, వివిధ రకముల వాణిజ్య భవన సముదాయములు మరియు ఆసుపత్రుల భవన నిర్మాణముల కొరకు అగ్ని నిరోధక పరికరములను ఏర్పాటు చేసుకొనుటలో సలహాలు, సూచనలు తెలియచేయబడును. Z మరియు Z+ బందోబస్తు గల ప్రముఖుల పర్యటన సందర్భములలో మరియు జాతరల సందర్భములలో ముందస్తు జగ్రత్తగా అగ్నిమాపక వాహనములు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

వివిధములైన ప్రభుత్వ పథకములు :

  1. కేంద్ర ప్రభుత్వ ఆమోదిత పథకములు : లేవు.
  2. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదిత పథకములు : లేవు.

సంప్రదించవలసిన అధికారుల వివరములు :

జిల్లా పరిధి అధికారుల వివరములు :

Sl.No పేరు మరియు హోదా పని ప్రదేశం మొబైల్ నంబర్ ఇమెయిల్ చిరునామా
1 M. భగవాన్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి O/o. డివిజనల్ ఫైర్ ఆఫీస్, వరంగల్, ఎదురుగా. మట్టెవాడ పోలీస్ స్టేషన్, వరంగల్ పిన్ నెం.506002 8712699149 dfo_wrl@yahoo.com
2 K.జయపాల్ రెడ్డి,Asst. జిల్లా అగ్నిమాపక అధికారి O/o. డివిజనల్ ఫైర్ ఆఫీస్, వరంగల్, ఎదురుగా. మట్టెవాడ పోలీస్ స్టేషన్, వరంగల్ పిన్ నెం.506002 8712699150 adfo_warangal@yahoo.com

మండల పరిధి అధికారుల వివరములు :

Sl.No పేరు మరియు హోదా పని ప్రదేశం మొబైల్ నంబర్ ఇమెయిల్ చిరునామా
1 ఎ.శ్రీనివాసరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అగ్నిమాపక కేంద్రం, వరంగల్ 8712699303 srinivasaraoamaraneni08@gmail.com
2 Ch.జయపాల్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అగ్నిమాపక కేంద్రం, నర్సంపేట 8712699309 cholleti.jayapalreddy@gmail.com
3 V.భద్రయ్య, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అగ్నిమాపక కేంద్రం, వర్ధన్నపేట 8712699311 vbmssb@gmail.com
4 ఎ.శ్రీనివాసరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గొర్రెకుంట ఫైర్ అవుట్‌పోస్ట్ 8712699312 srinivasaraoamaraneni08@gmail.com

 

వెబ్ సైట్ లో పొందుపరచిన డాక్యుమెంట్లు / నివేదికలు / యాక్షన్ ప్లాన్ / ఏవైనా ఉపయోగకరమైన డాక్యుమెంట్లు

  1. O. Ms. No. 253, Dt. 25-09-2010 – Revised charges for Private Standby duties & Pumping works.
  2. O. Ms. No. 168, Dt. 07-06-2012 – Building Rules and other related rules which are applicable to Municipal Corporation and areas covered by Urban Development Authorities in the State.
  3. O. Ms. No. 180, Dt. 03-11-2016 – Collection of User charges for various inspections for issue of No Objection Certificate.
  4. O. Ms. No. 56, Dt. 26-07-2019 – Fire Safety Measures to be followed in the Schools.
  5. O. Ms. No. 29, Dt. 24-09-2020 – Fire Safety Measures to be followed in the Junior Colleges.
  6. O. Ms. No. 53, Dt. 18-12-2020 – Fire Safety Measures to be followed in the Junior Colleges in Lieu of Deficiencies in Setbacks and Means of Escape.
  7. O. Ms. No. 103, Dt. 03-07-2021 – Rules for Podium Parking – Amendment to Building Rules, 2012.

తెలంగాణా రాష్ట్ర అగ్నిమాపక శాఖకు సంబంధించిన వెబ్ సైట్ చిరునామా :

https://fire.telangana.gov.in/