ముగించు

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ

వరంగల్  జిల్లా

 జిల్లా ఆద్వర్యంలో నిర్వహించబడు సంక్షేమ పథకాల వివరాలు :

  1. ప్రిమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాముల నిర్వహణ వివరాలు: జిల్లాలో మొత్తం  (04) ప్రీమెట్రిక్ వసతి గృహాలు నిర్వహింబడుచున్నవి, ఇందులో (04) బాలుర వసతి గృహాలు కలవు. దీనిలో 3 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వసతి కల్పించబడును, జిల్లాలో మొత్తం (8) పోస్ట్ మెట్రిక్  వసతి గృహాలు నిర్వహించబడుచున్నాయి, అందులో (03)  బాలుర మరియు (05) బాలికల వసతి గృహములు కలవు. పోస్ట్ మెట్రిక్  వసతి గృహాలందు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీ.జి., మరియు ఇతర కోర్సుల విద్యార్ధినీ/ విద్యార్ధులకు వసతి  కల్పించబడును.
  • ప్రీ మెట్రిక్,  పోస్ట్ మెట్రిక్ వసతి గృహ విద్యార్ధులకు చెల్లించే భోజన రుసుముల వివరములు:-

        3 వ, తరగతి నుండి 7 వ, తరగతి విద్యార్ధులకు నెలకు రూ. 1330/-

        8వ తరగతి నుండి 10 వ తరగతి  విద్యార్ధులకు నెలకు రూ. 1540/-

                             పోస్ట్ మెట్రిక్ ఒక విద్యార్థికి నెలకు రూ.2100/-

  • ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలలో అందించబడు భోజన సదుపాయాలు:- ఉదయం అల్పాహారం మరియు రెండు పూటల భోజనం తో పాలు, పెరుగు, గుడ్లు, మాంసం, కూరగాయలు మరియు స్నాక్స్ (పల్లీ చిక్కి మరియు గుగ్గిళ్ళు) వంటి పౌష్టిక విలువలతో కూడిన తాజా ఆహరం  అందిచబడుతుంది,
  • విద్యార్థులందరికి ఉచిత ఆరోగ్య పరీక్షలు:- ప్రతి నెల ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహ విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడును.
  • ప్రీ మెట్రిక్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జెస్: 3వ తరగతి నుండి 7వ తరగతి బాలురకు ఒక్కొకరికి నెలకు రూ.150/- మరియు 8వ తరగతి నుండి 10వ  తరగతి వారికి నెలకు రూ. 200/-. బాలికలకు 3వ తరగతి నుండి 7వ తరగతి వారికి నెలకు రూ.175/- మరియు 8వ తరగతి నుండి 10వ తరగతి వారికి రూ. 275/- చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
  • ప్రిమెట్రిక్ విద్యార్ధులకు ఉచితముగా పంపిణి చేయబడు వస్తువులు:- నోట్ బుక్స్ , , బెడ్ షీట్, కార్పెట్ ఉన్ని దుప్పటి ,ప్లేట్, గ్లాస్ మరియు ట్రంక్ బాక్స్.
  1. బి.సి. విద్యార్ధుల పోస్ట్ మెట్రిక్ (యం.టి.ఎఫ్),ఉపకారవేతనాలు మరియు ఫీజు రియంబర్స్ మెంట్:- ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీ.జి., మరియు ఇతర కోర్సుల విద్యార్ధినీ/ విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ  ప్రాంతాలకు (రూ.1.50 లక్షలు)  లక్ష యాబై వేలు రూపాయల వరకు మరియు పట్టణ ప్రాంతాలకు (రూ.2.00 లక్షలు) రెండు లక్షల  రూపాయల వరకు ఉన్న అర్హులైన బి.సి. విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వబడును.
  2. ఇ.బి.సి విద్యార్ధులకు ఫీజు రియంబర్స్ మెంట్:  డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీ.జి., మరియు ఇతర కోర్సుల చదువుతున్న ఇ.బి.సి విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక  ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు (రూ.1.50 లక్షలు)   లక్ష యాబై వేలు రూపాయల వరకు మరియు పట్టణ ప్రాంతాలకు (రూ.2.00 లక్షలు) రెండు లక్షల  రూపాయల వరకు ఉన్న అర్హులైన ఇ.బి.సి విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ (RTF) ఇవ్వబడుతున్నాయి.
  3. ట్రైని న్యాయవాదులకు పారితోషికం:- న్యాయ నిర్వహణ శిక్షణ పొందుతున్న బి.సి విద్యార్ధుల కొరకు ప్రభుత్వ౦ (4) సీట్లను కేటాయించినది. వారికి (3) సంవత్సరాల శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.1000/- లు స్టైఫెండ్, రూ 585/- లు   ఎన్రోల్ మెంట్ చార్జస్, రూ.3000/- లు పుస్తకాలు మరియు బుక్స్  కొరకు ప్రభుత్వ౦ చెల్లిస్తుంది. 
  4. బి.సి. కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు:- కులాంతర వివాహాలు చేసుకున్న బి.సి. కులమునకు చెందిన ప్రతి జంటకు ప్రోత్సాహక నిమిత్తం బహుమతిగా  రూ.10,000/- లు చొప్పున ఇవ్వబడును.
  5. కళ్యాణ లక్ష్మి పథకం:- సంక్షేమ శాఖలో సంస్కరణల మరియు విధానపరమైన చర్యలో భాగంగా వెనుకబడిన తరగతుల వారి కుటుంబంలో ఆర్ధిక దుస్థితిని తగ్గించేందుకు బి.సి./ ఇ.బి.సి. బాలికల వివాహము కోసం తెలంగాణ  ప్రభుత్వము “కళ్యాణ లక్ష్మి” పధకాన్ని ప్రవేశపెట్టింది.  ఇట్టి కళ్యాణలక్ష్మి పధకం క్రింద ప్రతి బి.సి. / ఇ.బి.సి. బాలికలకు వివాహ  సమయంలో రూ.1,00,116/- లు ఆర్ధిక సహాయము అందిచడo  జరుగుతుంది.
  6. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశి విద్యానిధి పథకం:- బి.సి. మరియు ఇ.బి.సి కులమునకు చెందిన విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం  రూపాయల 00 లక్షల మించకుండా ఉండి TOFEL/ IETS & GMAT /GRE /PTE లో మంచి మార్కులు వచ్చి విదేశాలలో ఉన్నత చదువులు (పిజి) చదువుకొనే బి.సి./ఇబిసి విద్యార్ధులకు రూ.20.00 లక్షలు ఉపకారవేతనంగా మంజూరు చేయబడును.
  7. తెలంగాణ రాష్ట (13) బి.సి.ఫైనాన్స్ కార్పొరేషన్ సోసైటి, (8) కులాల సహకార సమాఖ్యలు, యం.బి.సి. కార్పోరేషన్ మరియు ఇ.బి.సి./ఇ.డబ్ల్యు.యస్., కార్పోరేషన్:- సెల్ప్ ఎంప్లాయ్ మెంట్ స్కీం క్రింద దరఖాస్తు చేసుకున్న బి.సి/యం.బి.సి/ ఇ.బి.సి.(ఇ.డబ్ల్యు.యస్.,) కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు సంబందిత కార్పోరేషన్ ల  నుండి సబ్సిడీతో కూడిన ఋణ సహాయం కల్పించబడును.  
  8. రజక / నాయిబ్రహ్మణ కమ్యూనిటి వారికీ ఉచిత కరెంట్‌:- రజక / నాయిబ్రహ్మణ కమ్యూనిటి వారిచే నడుపబడు ధోబిఘూట్‌, ఐరన్‌ షాప్‌ మరియు హెర్‌ కట్టింగ్‌ సెలూన్‌ మొదలగు వాటికి ప్రతి నెల 250 యూనిట్స్‌ లోపు ఉచిత కరెంట్‌ నిమిత్తం ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంటు నుండి చెల్లించడము జరిగుతుంది.
  9. “కాటమయ్య రక్ష” (సేఫ్టీ కిట్టు) పంపిణీ కార్యక్రమం: తెలంగాణ గీతా కార్మిక ఆర్థిక సంస్థ కార్పోరేషన్, హైదారాబాద్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు తాటి చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడకుండా “కాటమయ్య రక్ష” సేఫ్టీ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది.